Thursday, July 14, 2011

ఉదయబాను


ఉదయబాను , Udayabanu
పరిచయం :
•ఉదయబాను టి.వి యాంకర్ / నటి . తన మాటల మయజాలము తో అందరిని ఆకట్టుకునే శక్తి , యుక్తి వున్న ఉత్తమయాంకర్ .
ప్రొఫైల్ :
•పేరు : ఉదయభాను ,
•పుట్టిన ఊరు : కరీం నగర్ ,
•నాన్న : యస్.కె.పటేల్ - డాక్టర్ ( మంచి రచియిత , ఉదయభాను అనే కలం పేరు తో కవితలు రాసేవారు ) ఉదయభాను కి 5 సం. వయసు లోనే చనిపోయారు ,,
•అమ్మ : ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ .. తన తల్లి 7 గురు పిల్లలున్న ఒక ముస్లిం ని పెళ్ళిచేసుకుంది ,
•సోదరుడు : ఒక సోదరుడు
•పుట్టిన తేది :
•భర్త : విజయ్
•పెళ్లి : ఉదయభాను కి 15 సం . వయసు లో కుటుంబ సబ్యులు బలవంతాన ముస్లిం అబ్బాయి తో పెల్లిచేసారు ... ఎన్నో కస్టాలు పది విడాకులు తీసుకొని , విజయ్ ని పెల్లిచేసు కుంది .
•మొదటి సినిమా : ఎర్ర సైన్యం _ఆర్.నారాయణ మూర్తి ,
•మొదటి టి.వి .ప్రోగ్రాం : ' హ్రిదయంజలి ' ప్రోగ్రాం .. ఈ .టి.వి. లో ,
ఫిల్మోగ్రఫీ : యాంకర్ గా :
•Dhee , బిగ్ షో,
•హార్లిక్స్ హృదయన్జిలి ,
•ఒన్స్ మోర్ ప్లీజ్ , జెమిని టి వి .
•సాహసం చేయరా డింభకా " జెమిని
•జా నవులే నెరజాణవులే " జెమిని
•తరుణీ తమసా - వనిత టి వి ,
•మహిళలు మహారాణులు
•"నీ ఇల్లు బంగారం కాను " on Zee Telugu •ఇంటికి దీపం ఇల్లాలు - వనిత టి వి .

•గోల్డ్ రష్ ,
•డాన్స్ బేబీ డాన్స్ ,
•రేల రే రేల ,
నటి గా :
•కొండవీటి సింహాసనం (2002) ,
•ఎర్ర సైన్యం ,
•"ఆపద మొక్కులవాడు "
•శ్రవణ మాసం(2005)

నరసింగరావు బొంగు

నరసింగరావు బొంగు , Narasingarao Bongu

పరిచయం :
•బొంగు నరసింగరావు .. తెలుగు సినీ డైరెక్టర్ ,రైటర్ ,పైంటర్ ,ఫోటోగ్రాఫర్ , ముజిసియన్ మరియు నటుడు .
ప్రొఫైల్ :
•పేరు : నరసింగరావు , బొంగు ,
•ఊరు : ప్రజ్ఞాపూర్ , మెదక్ జిల్లా ,
•పుట్టిన సం : 1946 ,
•చదువు : ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ,(హైదరాబాద్),
•కులము : వెలమదొర ,
•హబిస్ : నక్శలైట్ కల్చరల్ ఫ్రంట్ ప్రోగ్రామ్స్ లో పాలుపంచుకోవడం ,
ఫిల్మోగ్రఫీ : మూవీస్ as Actor
•రంగుల కల 1983 - Ravi
మూవీస్ as ప్రొడ్యూసర్-
•మా భూమి 1979
మూవీస్ as డైరెక్టర్
•హరివిల్లు 2003
•మట్టి మనుషులు 1990
•మా ఊరు 1987
•సిటీ, ది 1985
•కార్నివాల్, ది 1984
•రంగుల కల 1983
మూవీస్ as మ్యూజిక్ డైరెక్టర్
•హరివిల్లు 2003
•మా భూమి 1979
మూవీస్ as రైటర్
•హరివిల్లు 2003
•మా భూమి 1979

హరిష్ శంకర్ దర్శకుడు

Harish Sankar(film director),హరిష్ శంకర్ దర్శకుడు


పరిచయం (Introduction) :
•హరిష్ శంకర్ తెలుగు సినిమ దర్శకుడు . ఇండస్ట్రీకి వచ్చి 4 సంవత్సరాలు అయి మొదటిగా షాక్ (Shock) సినిమాని దర్శకత్వం చేసాడు . కోన వెంకట్ దగ్గర పనిచేసాడు .
జీవిత విశేషాలు (profile) :
•పేరు : హరిష్ శంకర్,
•స్వస్థలము : ధర్మపురి -కరీంనగర్ ,
•నాన్న : శ్యాం సుందర శర్మ -తెలుగు మాస్టార్ ,
•అమ్మ : సరోజ -గృహిణి ,
•తోబు్ట్టువులు : తమ్ముడు -విష్ణుప్రసాద్ , సోదరి -శ్రీవిద్య ,
•భార్య : స్నిగ్ధ ,
•చదువు : బి.యస్.సి ,ఎం.బి.ఎ.,
•అభిమాని : ఎండమూరి వీరేంద్రనాధ్ ,
కెరీర్ :
•చిన్నప్పటి నుండీ సినిమాలు చూడడం ఎక్కువ . అందుకు తన తండ్రి సహజంగా ఒక కళాకారుడు కావడం కారణము . చదువు కున్న రోజులలో స్టేజి డ్రామాలు వేసేవాడట . ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారట . ఏది చేసిన ఎక్కడ చేసినా తన దృష్టి అంతా దర్శకత్వం పైనే ఉండేదట . కొన్నాళ్ళు అసిస్టెంటుగా పనిచేసి తొలి సారిగా " షాక్ " సినిమా డైరెక్ట్ చేసి విజయం పొందేరు .తన మాటల్లో " ఈ సినిమా కంటే ముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తొలి అవకాశానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎక్కే గడప, దిగే గడ పా..అంతా షరామామూలుగానే నడిచింది. అయితే..తొలుత రవితేజ సినిమా ‘నిన్నే ఇష్ట పడ్డాను’(2003)కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవ కాశమొచ్చింది. ఆ సినిమా నిర్మించిన దుర్గా ఆర్ట్‌‌స నాకు మాతృసంస్థ. కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.గోపాల్‌రెడ్డిలు ఎంతో ప్రోత్సాహించారు నా మాతృసంస్థకు ఎప్పటికైనా ఓ మంచి సిని మా చేయాలి). తర్వాత రవితేజ చిత్రం ‘వీడే’కి అసోసియేట్‌ డైరెక్టర్‌గా ప్రమోటయ్యాను. మరుసటి ఏడాది ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమ రీస్‌’ (2004) చిత్రానికి కోడైరెక్టర్‌గా పని చే శాను. నా గ్రాఫ్‌ ఒక్కో చిత్రానికి ఒక్కో మెట్టులా ఎదిగి ఇలా ప్రస్తుతం డైరెక్టరయ్యాను. " అని అంటారు .
నటించిన సినిమాలు (filmography ): దర్శకత్వం :
•షాక్ (shock)--2006,
•మిరపకాయ ---2011,
రైటర్ గా :
•ఆట -స్తోరీ --2007,
•షాక్ -2006,
అసిస్టెంట్ డైరెఖ్టర్ గా :
•నిన్నే ఇస్టపడ్డాను --2003,
•గొడవ -- థాంక్స్ (గెస్ట్ గా) --2007,

పద...తెలంగాణపురం!

భాగ్యన గరానికి చేరువలో 600 ఏళ్ల క్రితం సువిశాలమైన తెలంగాణపురం విలసిల్లిందనేందుకు చారిత్రక ఆధారాలు లభించాయి. తొలిసారిగా తెలంగాణ పదం ఉన్న శాసనం కూడా ప్రస్తుతం తెల్లాపూర్‌గా పిలుస్తున్న గ్రామంలో లభ్యమైంది.ఆ శాసనాన్ని, చారిత్రక ఆధారాలను పరిరక్షించి, దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దేందుకు పురావస్తుశాఖ సన్నాహాలు చేస్తున్నది.

తెలుగుతనం నింపుకున్న మహత్తర దశతోపాటు, తొలిసారిగా తెలంగాణ పదం ప్రస్తావనకు వచ్చిన చారిత్రక సంపద మన ముంగిటనే ఉంది. రాజధాని శివార్లలో ఈ మధ్యకాలంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని అంతా చెప్పుకునే ఒక పల్లెలో ఒకనాటి మహనగరం మట్టిపాలై ఉందని తెలిస్తే మనసు ఒకింత కలతచెందుతుంది. తెలుగుగడ్డకు రాజధానిగా మారిన హైదరాబాద్ ఆవిర్భావానికి 170 ఏళ్ళకు ముందే ఆ పరిసరంలో తెలంగాణపురం మహా ప్రాభవంతో ఉందని చరిత్ర చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో శివార్లలో, బి.హెచ్.ఇ.ఎల్.కి దాపునే ఉన్న తెల్లాపూర్ గ్రామంలో ఒక శిలాశాసనం క్రీస్తుశకం 1418 నాటి స్మృతులను కళ్లముందు పరుస్తున్నది. అధునాతన ఆకాశహర్మ్యాలు, పెద్దపెద్ద ఫామ్‌హౌస్‌ల చెంతనే ఉన్న చిన్నపల్లె తెల్లాపూర్‌లో గత వైభవ ప్రాభవం దోబూచులాడుతోంది.

నాగరిక ప్రాంతం.. పురం
600 ఏళ్ళ క్రితం ప్రస్తుతం మనం ఉంటున్న ప్రాంతంలో ఇంతటి మహోన్నత ఘట్టాలు చోటుచేసుకున్నాయా అనే ఆలోచనలు మనసుల్ని ఉప్పొంగేలా చేస్తాయి. ప్రపంచం వ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాల చరిత్రతో తెలంగాణ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే అపురూప చారిత్రక ఘట్టాలు కళ్ల ముందు కదలాడుతాయి. పూర్వం నివాస ప్రాంతాలు, వాటి జనసాంద్రత పద్ధతుల్ని బట్టి ఊర్ల పేర్లు ఉండేవి. గ్రామం, ఆవాసం, పట్టణం, నగరం, శాఖానగరం, కర్వటం, పురం వంటి విభజన ఉండేది. చాలా విశాలమైన వాణిజ్య సముదాయాలు ఉన్న 'మార్కెట్ ప్లేస్'ని కర్వటంగా పిలుచుకునేవారు.

అలాంటి పలు కట్వరాలు ఉన్న నాగరికప్రాంతం 'పురం'గా పరిగణనలో ఉండేది. ఇప్పటి 'తెల్లాపురం' మీద కాస్తంత శ్రద్ధ పెడితే అప్పటి వైభవం చారిత్రక ఆధారాలతో రుజువు అవుతుంది. నాటి కాలంలో ఉత్తర భారతం నుంచి మన ప్రాంతానికి రాకపోకల కోసం ఏర్పాటు చేసుకున్న రహదారుల్లో ఔరంగాబాద్ - బీదర్ - గోల్కొండలను కలిపే దారి ప్రధానమైనది. 10వ శతాబ్దం నాటికే సకల విధాలా అభివృద్ధి చెందిన నగరంగా 'పట్టన్‌చెరు'ను పలు చారిత్రక సందర్భాల్లో పేర్కొన్నారు. 972-1152 మధ్యకాలంలో వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ ప్రభువులు వరుసగా ఆయా ప్రాంతాల్ని అభివృద్ధి చేశారు. అప్పటి వాణిజ్య సంబంధాలు, జైనం, బౌద్ధం, హిందూ, ముస్లిం మత ప్రశస్తితో పాటు పలు విశేషాలు చరిత్రలో రుజువులతో సహా ఉన్నాయి.

ఫిరోజ్‌షా కాలం నాటి శాసనం
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పాలనను మనం స్వర్ణయుగంగా మురిపెంగా చెప్పుకుంటాం. ఆ కాలానికి కొంచెం ముందు గోల్కొండ - తెల్లాపూర్ - పటాన్‌చెరు ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్‌లు పరిపాలించారు. నాటి రాజు ఫిరోజ్ షా కాలంలో తెలంగాణపురంలోని విశ్వకర్మ కులపెద్దలు పెద్ద దిగుడు బావి వద్ద ఒక శిలాఫలకం వేయించారు. అప్పటి కాలం తెలుగులో ఆ శాసనంలో మొట్టమొదటిసారిగా 'తెలంగాణ' మాట కనిపిస్తుంది.

శక సంవత్సరం 1340లో శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, మాఘమాసం, గురువారం నాడు ఆ శాసన ఫలకాన్ని ప్రతిష్టించారు. మన లెక్కల ప్రకారం అయితే 1418లో జనవరి 8నాడు ఆ శాసనం వేశారని భావిస్తున్నారు. నాటి పరిపాలన విధివిధానాల్లో టౌన్ ప్లానింగ్‌కు బాధ్యతలు వహించే విశ్వకర్మలలో నిష్ణాతుడైన రుద్రోజు సిరిగిరోజు ఆ ఫలకాన్ని రాయించి వేయించాడని శాసనంలోనే పేర్కొన్నారు. 'ఓజు' అంటే అందరి మేలు కోరే మేధావి, అధ్యాపకుడు వంటి అర్థం ఉంది. నాటి ఓజుల్లో పెద్దలైన మైలోజు, పోచోజు, నాగోజుల కుటుంబంలోంచి అయ్యలోజు, వల్లభోజులు కనిపరిచిన రాజభక్తి ప్రస్తావన అందులో ఉంది.

తమ రాజు ఫిరోజ్ షా పట్టమహిషికి బంగారంతో చేసిన కంఠాభరణం, గాజు పూసలతో చాలా సొంపు, సోయగాలతో చేసిన మాలను కానుకగా సమర్పించిన వైనం కూడా శిలాక్షరాలలో ఉంది. ఆ శాసనం పక్కనే గల విశాలమైన మామిడితోపు, అందుకు ఏర్పాటు చేసిన సాగు పద్ధతులు 'ఏతం' వంటి అమరికను కూడా ప్రస్తావించారు. చారిత్రక ఆధారాలను బట్టి ఇప్పటి 'తెలంగాణ'కు సమాన అర్థంలో వాడిన తిలింగ్, తెలింగలు 15వ శతాబ్దంలోని ప్రభుత్వ శాసనాలు, ఉత్తర్వులలో ఉన్నాయని తేలుతోంది. క్రీస్తుశకం 1510లో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్ర గజపతి వేయించిన వెలిచెర్ల శాసనంలో 'తెలంగాణ' మాట ఉంది. అంతకుముందు క్రీస్తుశకం 1358లో శ్రీరంగంలోని తామ్రశాసనంలో 'తెలింగదేశం' ప్రస్తావన ఉంది. 'తెలంగాణ' పదం మరెక్కడా లేనివిధంగా 'తెలంగాణపురం' (తెల్లాపురం)లో వాడుకలో ఉందని తెలుస్తోంది. 1418 ప్రాంతంలో బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా నల్గొండ జిల్లాలోని పానగల్లు కోటను విజయనగర పాలకుడైన దేవరాయలు-2 నుంచి ఆధీనం చేసుకోవటానికి వెళ్తూ తెలంగాణపురంలో మజిలీ చేశాడని కూడా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.

పునరుద్ధరణ చర్యలు
నిజాం ప్రభుత్వం 1940 ప్రాంతంలోనే ప్రత్యేకంగా పురావస్తు శాఖను ప్రారంభించింది. అయితే స్థానిక చారిత్రక సంపదను పరిరక్షించే విషయంలో మాత్రం అంతగా శ్రద్ధ చూపలేదు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పురావస్తు శాఖ పనితీరు మరింత మందగించింది. నిధుల కొరత ఆ శాఖకు శాపంగా మారింది. ప్రస్తుత పురావస్తు శాఖ సంచాలకుడు పెద్దారపు చెన్నారెడ్డి రెండేళ్లుగా ఉన్నంతలోనే చురుకైన కార్యకలాపాలు చేపడుతున్నారు.

తెలంగాణపురం విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈమని శివనాగిరెడ్డితోపాటు మరికొందరు పురావస్తు శాఖ అధికారులు, సిబ్బంది కలిసి 'తెలంగాణపుర శాసన మండపం' పునరుద్ధరణ కోసం చురుగ్గా కృషి చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు చారిత్రక పరిశో«ధకులు, నిపుణులతో కలసి ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. తెల్లాపురంలో కొన్నే ళ్ల వరకు ఉనికిలో ఉన్న దిగుడుబావి ఇప్పుడు కనుమరుగైంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న శిలా ఫలకాలను ఒక పద్ధతిలో అమర్చి మండపంగా పునరుద్ధరించారు. 600 ఏళ్ళనాటి 'ఏతం' రాతి స్తంభాలను ఆ దిమ్మపై అమర్చి మధ్యలో శిలాఫలకంతో ఆకర్షణీయంగా మలిచారు.

ఆ పరిసరాల్లో పాత రోజుల్లో బావి గట్టుపై ఏర్పాటు చేసిన విడిది, డ్రెస్సింగ్ రూమ్, అప్పటి అలంకరణ పద్ధతులు, పరికరాలను ప్రదర్శించేలా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లోని స్టేట్ మ్యూజియంలో తెల్లాపూర్ వైభవ ప్రాభవాల్ని ప్రదర్శించే ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం పెరిగి, తగినన్ని నిధులు ఉంటే చారిత్రక సంపద పరిరక్షణకు సకల చర్యలూ తీసుకోవడం సాధ్యం అవుతుందని పురావస్తుశాఖ, ప్రదర్శన శాలల అధిపతి ఆచార్య పి.చెన్నారెడ్డి అంటున్నారు.