Saturday, November 20, 2010

తొలి తెలుగు హీరో 'పైడి జైరాజ్'

పైడి జైరాజ్ (1909 - 2000) భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఇతను 1909 సంవత్సరం సెప్టెంబరు 28న కరీంనగర్లో జన్మించాడు.అందాల నటులైన ఇతను స్వయంకృషికి ప్రతీక.ఈయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.ఈయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.
నటనా జీవితం'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కధానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించాడు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఇతను చెప్పేవాడు. ఇతను పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి.

దర్శకత్వం
పైడి జైరాజ్ మెహర్, రాజ్ ఘర్, మాల, ప్రతిమ అనే నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పి.జె. ఫిల్మ్స్ యూనిట్ పతాకంపై ప్రసిద్ధనటి నర్గీస్ కథానాయికగా 'సాగర్' చిత్రాన్ని 1951లో నిర్మించాడు.

అవార్డులు
జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది.

No comments:

Post a Comment