Friday, February 3, 2012

Monday, January 2, 2012

Kadhal.Fm.2005.cd2.[TamilRelease.Com]

http://www.videobb.com/video/UcgEdH8vKkxw

Sunday, January 1, 2012

ఢిల్లీ పీఠంపై జెండా నాటిన ఒకే ఒక్క తెలుగువాడు

తెలంగాణ తేనె మాగాణంలో పల్లవించిన మేరునగం ఆయన! రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహస్ర ప్రతిభా దళాలతో పరిమళించిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం! జాతీయ కాంగ్రెస్ మహా నేతల్లో జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ శ్రేణిలో ప్రధాని పదవిని అలంకరించిన దిట్ట! దేశంలో ఏకైక తెలుగు ప్రధాని.. తెలంగాణబిడ్డ! కేవలం ముఖ్యమంవూతులుగా పని చేసిన ఎన్టీఆర్, వైఎస్ సహా ఎందందరి విగ్రహాలో పల్లెలు మొదలు నగరాల కూడళ్ల దాకా కుప్పలు తెప్పలుగా నిలు నిలబడి ధగధగలాడుతుంటే.. దేశానికే ప్రధానిగా పని చేసి కనీసం సొంత గ్రామంలో కూడా విగ్రహానికి నోచుకోని తెలంగాణ రాజకీయ పేద! మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నిరాటంకంగా నడిపి, రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న దురంధరుడైనా.. కనీస గుర్తింపునకు నోచుకోని మేధావి! హైదరాబాద్ నగరంలో ఎక్స్‌ప్రెస్ వే మినహా ఏ ఒక్క మార్గానికి లేదా.. పార్కుకు పేరు పెట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మనసొప్పని దారుణ వివక్షను ఎదుర్కొన్న దివంగత నేత..! పాములపర్తి వేంకట నర్సింహారావు! తెలంగాణకు ఠీవిగా నిలిచిన పీవీ ఏడవ వర్థంతి నేడు! ఈ సందర్భంగా ఆయన సమకాలికులు, ఆయన అడుగుజాడల్లో నడిచినవారు, ఇంకా నడుస్తున్న వారు నెమరేసుకున్న జ్ఞాపకాలు.. పీవీ రాజకీయ జీవిత విశేషాలు

హైదరాబాద్, డిసెంబర్ 22 (టీన్యూస్)టైపధాని పదవి అధిరోహించిన ఏకైక తెలుగువాడు.. ప్రత్యేకించి తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు. ఒక మహనీయుడు చనిపోతే ఇవ్వాల్సిన కనీస గౌరవాలకు నోచుకోని నేతగా మిగిలిపోయారు. దేశ ప్రధానిగా పని చేసిన మహా నేత చనిపోయి నేటికి ఏడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఆయ విగ్రహం ఎక్కడా లేదంటే కొంత ఆశ్చర్యకరమే! హైదరాబాద్ నగరంలోని ఎక్స్‌ప్రెస్ వే మినహా మరెక్కడా పేరు ఆయన పేరు కనిపించదు. ఇది ఆ మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన.. ఇస్తున్న ‘గౌరవం’!!

దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991 జూన్ 21న పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన ఎంపీ కూడా కారు. ఆ తరువాత రాష్ట్రంలోని నంద్యాల నుంచి పోటీ చేసి 5,80,287 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అది కూడా ప్రచారానికి రాకుండానే. పీవీ అధికారం చేప పంజాబ్, కశ్మీర్, అసోం రాష్ట్రాల్లో ఉగ్రవాదుల హింసాయుత కార్యకలాపాలు దేశ సమైక్యత, భద్రతకు ఒక సవాల్‌గా పరిణమించాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుని ఉంది. దీనితో ఒకవైపు దేశంలో పరిస్థితులను చక్కదిద్దుతూనే ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాల్సిన బాధ్యత పీవీపై పడింది. నడుపుతున్నది మైనార్టీ ప్రభుత్వమే అయినా.. తనదైన కార్యనిర్వాహణతో అన్ని వర్గాలను ఆకట్టుకుని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, వ్యూహరచనతో ముందుకు సాగారు. తన మంత్రివర్గంలో తెలుగువారికి ప్రాధాన్యం ఇస్తూ.. కోట్ల విజయభాస్కర్‌డ్డి, కమాలుద్దీన్ అహ్మద్, మల్లికార్జున్, వెంకటస్వామి, చింతామోహన్, కమలకుమారి, పీవీ రంగయ్యనాయుడును మంత్రులను చేశారు.

ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా.. దానిని ఎదుర్కొని సర్కారును నెట్టుకొచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడంలో పీవీ చేపట్టిన నూతన ఆర్థిక విధానాలు వివాదాస్పదమైనా, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా.. దేశంలో నూతన పారిక్షిశామిక అభివృద్ధికి పీవీ బాటలు వేశారన్నది వాస్తవం. ఇందులో ప్రధానమైనది లైసెన్స్ రాజ్ వ్యవస్థను రద్దు చేయడం.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా
అప్పటి ఏఐసీసీ అధినేత, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో హత్యకు గురయ్యారు. అప్పటికే మధ్యంతర ఎన్నికల్లో ఒక విడత ఓటింగ్ పూర్తయి రెండవ విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందిర హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ కూడా హత్యకు గురికావడంతో ఇక కాంగ్రెస్‌కు దిక్కెవరన్న చర్చ జరిగింది. పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన భార్య సోనియా నిరాకరించారు. దీంతో అప్పటికే ఇందిర, రాజీవ్ మంత్రి వర్గాల్లో కీలక శాఖలు నిర్వహించిన పీవీని తాత్కాలికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఎన్నికల ఫలితాలు వెలవడ్డాక ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ 224 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో హస్తినలో తొలి తెలుగు నేత ప్రధాని పీఠం అధిష్టించినట్లయింది.

వరంగల్‌తో అనుబంధం
వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. సీతారాంరావు, రుక్మాబాయమ్మ దంపతులకు ఆయన తొలిసంతానం. పీవీ ఉన్నత విద్యాభ్యాసం హన్మకొండలో జరిగింది. అప్పటికే వరంగల్, హన్మకొండ జంటనగరాలుగా, అత్యంత చైతన్యవంతంగా ఉండేవి. నాటికే రాజకీయ, సాంస్కృతిక, సంఘసంస్కరణ ఉద్యమాలు ఆవిర్భవించాయి. మద్రాస్, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారు వరంగల్ పాఠశాలలో, కళాశాలలో ఉపాధ్యాయులుగా చదువులు చెప్పేవారు. పాఠశాల రోజుల్లోనే పీవీ ప్రతిభావంతుడిగా, చురుకైన విద్యార్థిగా, సూక్ష్మగ్రాహిగా పేరు తెచ్చుకున్నారు. యువకుడిగా ఉన్న కాలంలోనే కందుకూరి, గురజాడ, పానుగంటి, చిలకమర్తి, గిడుగు, తిరుపతి వెంకటకవులు, వెంకట పార్వతీశ్వర కవులు, కాశీనాథుని నాగేశ్వరరావు వంటి మహానీయుల రచనలు ఆయన్ని ఎంతో ఆకర్షించాయి. లలితకళలలో కూడా పీవీకి మంచి ప్రవేశం ఉంది. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళి సినిమాలు చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పీవీ స్వయంగా ఎన్నో వృత్తాలు, ద్విపదలు, గీతాలు రాశారు. దేశ చరిత్రలో ప్రసిద్ధుడైన జయచంద్రుని గురించి ‘జయచంద్ర హైందవద్వంసకా’ అనే కవిత వరంగల్‌లోని భజనమండలిలో బాగా ప్రచారం పొందింది. మహాకవి గ్రే ఎలిజీని రచనను తెలుగులోకి అనువదించారు. ‘గాదర్డ్ పెటల్స్’ అనే పేరుతో ఇంగ్లీష్‌లో కొన్ని భావ గీతాలు కూడా రాశారు. ఇంతటి అనుభవాలున్న పీవీ మహాకవి కాలేదు. నవలా రచయిత కాలేదు. కానీ.. రాజకీయ నాయకుడయ్యారు.

హైదరాబాద్ స్వాతంవూత్యోద్యమం
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాద్ సంస్థానంగా ఉన్న నిజాం ప్రభుత్వం ఇక్కడి స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధాన్ని తొలగించింది. దాంతో స్వామి రామానందతీర్ధ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే దశలో చోటు చేసుకున్న ఘటనలు పీవీని ఆవేదనకు గురి చేశాయి. అవే ఇతివృత్తాలుగా నీలంపట్టు చీర అనే శీర్షికతో పీవీ కథ రాశారు. పోలీసు చర్య తర్వాత 1948లో వరంగల్‌లో పీవీ తన సన్నిహిత మిత్రుడైన పాములపర్తి సదాశివరావుతో కాకతీయ అనే పత్రికను స్థాపించారు. పోలీసు చర్య అనంతరం కొంత కాలానికి మిలిటరీ ప్రభుత్వం స్థానంలో సీనియర్ ఐపీఎస్ వెల్లోడి సీఎంగా పౌరపాలన ఏర్పడింది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ రెండుగా చీలింది. రామనంద నాయకత్వంలో అతివాద వర్గం, జనార్ధన్‌రావు దేశాయి, బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగాడ్డితో మితవాద వర్గాలు ఏర్పడ్డాయి. రామానంద నాయకత్వాన్ని పీవీ సమర్థించారు. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని శాంతి భద్రతల సమస్యగా చూడరాదని స్వామి రామానంద అన్న మాటలు పీవీని ఎంతగానో ఆకర్షించాయి. అందుకే పీవీ ఆయన పట్ల ఆయన గౌరవ భావాన్ని కలిగి ఉండే వారు. 1952 జనవరిలో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే మూడు నెలల ముందు తమ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీ, ఇతర అభ్యుదయభావాలు కలిగిన వారందరూ కలిసి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో పీడీఎఫ్ ఘన విజయం సాధించింది. అదే సమయంలో పీవీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తొలి హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో స్వామి రామానంద తీర్ధ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పీవీని కాంగ్రెస్ కార్యదర్శుల్లో ఒకరిగా నియమించారు.

ముఖ్యమంత్రిగా..
కాసు బ్రహ్మానందడ్డి ముఖ్యమంవూతిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణ ప్రాంత నాయకుడికి సీఎం పదవి ఇవ్వడంపై అధిష్ఠానం యోచిస్తున్న సమయంలోనే పీవీ వారి దృష్టిలో పడ్డారు. అప్పటికే నూకల రామచంవూదాడ్డి, జే చొక్కారావు, టీ అంజయ్యతో పాటు తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మర్రి చెన్నాడ్డి బలమైన నేతలుగా ఉన్నారు. 1971 సెప్టెంబర్ 30న పీవీని శాసన సభాపక్ష నేతగా ఏకక్షిగీవంగా ఎన్నుకోవడంతో ముఖ్యమంవూతిగా ప్రమాణస్వీకారం చేశారు. 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పీవీ మంథని నుంచి గెలుపొంది మార్చి 20న సీఎంగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1970 డిసెంబర్‌లో ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని ఇచ్చిన తీర్పును 1972లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రద్దు చేసింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళింది. అదే ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తే ఆంధ్రవూపాంత విద్యార్థులకు హైదరాబాద్ జంటనగరాల్లోని విద్యా సంస్థల్లో సీట్లు లభించవనే ప్రచారం జరిగింది. విద్యార్థి ఉద్యమాలు తెలంగాణ, ఆంధ్రాలో ఉవ్వెత్తున లేచాయి. రాష్ట్ర విభజన ప్రసక్తే లేదని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నాటి ప్రధాని ఇందిర ప్రకటించి పంచసూత్రాలను రూపొందించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ పీవీ మంత్రివర్గంలోని 9 మంది మంత్రులు పదవులకు రాజీనామాలు చేశారు. 1973 జనవరి 11న ఎనిమిది మంది మంత్రులను పీవీ తన కేబినెట్‌లో కొత్తగా చేర్చుకున్నారు. అయినప్పటికీ ఆంధ్రా నేతల ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వాన్ని మార్చితే తప్ప ఉద్యమం తగ్గుముఖం పట్టదని ఇందిరకు కొందరు పెద్దలు సూచించారు. దాంతో ప్రధాని ఆదేశం మేరకు పీవీ 1973 జనవరి 17న తన పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు.

అంతర్జాతీయ రాజకీయాల్లో
ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా, అధికారంలో ఉన్నా, లేక పోయినా ఆమె అనుయాయుడిగా, విశ్వాస పాత్రుడిగా ఉంటూ వచ్చారు పీవీ. ఎమర్జెన్సీ తర్వాత దేశ మంతటా కాంగ్రెస్ ఓడిపోయినా.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. 42 స్థానాల్లో 41 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుందంటే పీవీనే ప్రధాన కారణమని అంటారు. ఎమ్జన్సీ తరువాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లోనే ఆయన హన్మకొండ నుంచి గెలుపొందారు. అప్పడు ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆమె కేబినెట్‌లో పీవీ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా సామర్థాన్ని అంతర్జాతీయ దౌత్యంలో ప్రదర్శించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.

వందేమాతర ఉద్యంతోనే రాజకీయాల్లోకి
1938 అక్టోబర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించడంతో ఆ గీతాన్ని నిషేధిస్తూ నాటి సర్కార్ సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు దాన్ని ఖాతరు చేయలేదు. వందేమాతరం ఆలపించే విద్యార్థులందరినీ కళాశాల నుంచి బహిష్కరిస్తున్నట్లు 1938 నవంబర్ 29న ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి పంపేశారు. ఈ వార్త నిజాం సంస్థానంలోని అన్ని జిల్లాలకు పాకింది. విద్యార్థులందరూ తరగతులు బహిష్కరించారు. వరంగల్, హన్మకొండ పట్టణ విద్యార్థులకు పీవీ నేతృత్వం వహించారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పేర్లను తరగతుల హాజరుపట్టీల నుంచి తొలగిస్తూ భవిష్యత్తులో వారికి ఎక్కడా అడ్మిషన్లు ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. దీంతో పీవీ నాగ్‌పూర్ వెళ్ళి అక్కడి యూనివర్సిటీ నుంచి ఇంటర్‌పూర్తి చేశారు. ఆ తరువాత పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో వీఎస్సీ పూర్తి చేశారు. మళ్ళీ నాగ్‌పూర్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివి స్వర్ణ పతకం సాధించారు. నాగ్‌పూర్‌లో చదివే రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్‌ను కలిసి ఆటోక్షిగాఫ్ తీసుకున్నారు. న్యాయ శాస్త్రంలో పట్టాపొంది హైదరాబాద్ చేరుకుని అప్పటి ప్రముఖ న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా చేరారు.

పీవీ జీవిత ప్రస్థానం
పేరు: పాములపర్తి వెంకటనర్సింహారావు
జననం: 1921, జూన్ 28
తల్లిదంవూడులు: రంగారావు, రుక్మిణి
స్వస్థలం: భీమదేవరపల్లి, వంగర మండలం, కరీంనగర్ జిల్లా
- 1947లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
- 1952లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లాడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
- 1954 నుంచి 56 వరకు జిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు.
- 1957 నుంచి 62 వరకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
- ఆ సమయంలోనే మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 62,67,72 వరకు వరుస విజయాలను సాధించారు. సమాచార, జైళ్ళ, న్యాయశాఖమంవూతిగా పనిచేశారు.
- 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంవూతిగా ప్రమాణం చేశారు.
- భూ సంస్కరణలచట్టం ప్రవేశపెట్టి స్వగ్రామమైన వంగరలో 1100 ఎకరాల భూమిని ప్రభుత్వానికి దారాదత్తం చేశారు.
- భూ సంస్కరణల చట్టం వల్ల సొంత పార్టీలోనే విభేదాలు తలెత్తడంతో 1973లో పీవీ గద్దె దిగాల్సి వచ్చింది.
- 1977లో హన్మకొండ లోక్‌సభ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలోనే కేంద్ర విదేశాంగ, దేశ, వ్యవహారాల, హోంశాఖ మంత్రిగా పనిచేశారు.
- 1991లో రాజీవ్‌గాంధీ మరణాంతరం జూన్ 21న ఊహించని రీతిలో ప్రధానమంత్రి అయ్యారు.
- ప్రధానిగా నూతన పారిక్షిశామిక ఆర్థిక విధానం ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేశారు.
- 2004,డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు.

ప్రాంతీయ పత్రికలు సర్కులేషన్‌లో 8.23 శాతం వృద్ది

న్యూఢిల్లీ, జనవరి 1: భారత్‌లో వార్తా పత్రికల సర్క్యులేషన్ పెరుగుతోంది. 2010-11 సంవత్సరంలో కూడా 8శాతానికిపైగా వృద్ధి నమోదైంది. అందులోనూ ప్రాంతీయ పత్రికల హవానే ఎక్కువ. గత ఏడాది దేశంలోని వార్తాపత్రికల సర్క్యులేషన్ 8.23శాతం పెరిగింది. 'రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా'(ఆర్ఎన్ఐ) తన 55వ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. పాశ్చాత్య దేశాల్లో పత్రికా రంగం అనిశ్చితిలో పడినప్పటికీ.. భారత్‌లో మాత్రం దాని ప్రభావం లేదని ఆర్ఎన్ఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3671 వార్తా పత్రికలు ప్రచురితమయ్యాయి. ఢిల్లీలో 1933, మధ్యప్రదేశ్‌లో 1243 పత్రికలు వెలువడ్డాయి.

సర్క్యులేషన్ విషయంలో కూడా యూపీనే ముందుంది. అక్కడ 6.97కోట్ల ప్రతులు అమ్ముడవుతున్నాయి. ఇక ఢిల్లీలో 5.27 కోట్లు, మూడోస్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2.9 కోట్ల కాపీలు చలామణి అవుతున్నాయి. ప్రాంతీయ పత్రికల గురించి ప్రస్తావిస్తూ.. అవి తమ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న ఇతర నగరాల్లో కూడా ఎడిషన్లు ప్రారంభిస్తున్నాయని ఆర్ఎన్ఐ వ్యాఖ్యానించింది. ఇక అత్యధిక మల్టీ ఎడిషన్ పాఠకులతో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' అగ్రస్థానంలో నిలిచింది. 12 ఎడిషన్లు కలిపి దీనికి 37,46,929 కాపీల సర్క్యులేషన్ ఉందని ఆర్ఎన్ఐ నివేదిక పేర్కొంది. పీరియాడికల్స్ (నియతకాలిక పత్రికలు) విభాగంలో 'ద హిందూ వీక్లీ' ముందుకు దూసుకెళ్లింది.

గత ఏడాది దేశంలో 603 ద్విభాషా, 78 బహు భాషా పత్రికలు విడుదలయ్యాయి. కాగా,1406 ఇంగ్లీష్ పత్రికల్లో 728 నాలుగు మెట్రో నగరాల నుంచే వెలువడుతున్నాయి. రాష్ట్రాల రాజధానులు, ప్రముఖ పట్టణాలు వంటి 21 ప్రాంతాల నుంచి వందకుపైగా పత్రికలు ప్రచురితమవుతున్నాయి. దేశంలో ఉన్న 14,508 వార్తా పత్రికల్లో దాదాపు 11,775 పత్రికలు స్వతంత్ర వ్యక్తుల ఆధ్యర్యంలోనే నడుస్తున్నాయి. ఇవే మార్కెట్ సర్క్యులేషన్‌లో అత్యధిక వాటా(56.59శాతం) చేజిక్కించుకుంటున్నాయి.

రాకాసి బిల్లులకు ఈ ప్రాంతం ఆలవాలం

ఆదిలాబాద్ నుంచి రాజమండ్రి దాకా..
రాకాసి బిల్లులకు ఈ ప్రాంతం ఆలవాలం
అగ్ని పర్వత విస్పోటంతో జీవజాలం నాశనం
మహాబలేశ్వర్ సమీపంలో భారీ పేలుడు
గో'దారి'లో సాగిన లావా ప్రవాహం
లోలోతు లావాలోనే ఖనిజ నిక్షేపాలు
తాజా పరిశోధనల్లో వెల్లడి

ఒక్కసారి కళ్లు మూసుకోండి! చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనసులోంచి చెరిపేయండి. గతంలోకి వెళ్లిపోండి! బాగా గతంలోకి... ఇంకా ఇంకా... ఇంకా గతంలోకి! ఆ గతం ఎలా ఉండేదో తెలుసా?

భారీ సైజులో డైనోసార్లు, వింత మృగాలు, రకరకాల పక్షి జాతులు, గాలిలోని ఆక్సిజన్ శాతంలో ఏమాత్రం తేడా వచ్చినా విలవిలలాడిపోయే సముద్ర జీవులు, చిత్రవిచిత్రమైన వృక్షాలు- ఒక్క మాటలో చెప్పాలంటే మనం నివసిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు జురాసిక్ పార్క్‌లా ఉండేది. ఆ సమయంలో... ఒక పెద్ద అగ్ని పర్వతం బద్దలయింది. దాని నుంచి కొన్ని వేల కోట్ల టన్నుల లావా పొంగిపొర్లింది. అదే స్థాయిలో బూడిద, రకరకాల వాయువులు వాతావరణంలో కలిశాయి. ఆమ్ల వర్షాలు కురిశాయి. ఈ బీభత్సానికి డైనోసార్లతో సహా వృక్ష, జీవ జాతులన్నీ సర్వనాశమయిపోయాయి. అలా ఉప్పొంగిన లావా నెమ్మదిగా గట్టిపడింది. లక్ష సంవత్సరాలు గడిచేసరికి లావా ప్రవహించిన ప్రాంతంలో మార్పులు మొదలయ్యాయి. లావా బాగా లోతుగా పేరుకు పోయిన ప్రాంతంలో ఖనిజాలు, చమురు, సహజ వాయు నిక్షేపాలు ఏర్పడ్డాయి. ఇదేదో జురాసిక్ పార్క్-4 సినిమా కాదు. నిజంగా నిజం! ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో తేలిన విషయం. లావాలో చిక్కుకుపోయిన సముద్ర జంతువుల అవశేషాల సాక్షిగా రుజువైన నిజం. ఇంతకూ...

కొత్త సిద్ధాంతం!
భూమిపై ఉన్న జాతులన్నీ అంతరించిపోవటానికి మెక్సికో సమీపంలో చిక్సుక్లబ్ అనే ప్రాంతంలో పడిన గ్రహ శకలం కారణమని శాస్త్రవేత్తలు ఇప్పటి దాకా భావిస్తూ వచ్చారు. అయితే.. కేవలం గ్రహ శకలం వల్ల డైనోసార్లు, ఇతర జీవులు అంతరించిపోయాయనే వాదనలో అంత పస లేదని తేలింది. లావా ప్రవాహం, యాసిడ్ వర్షాల పాత్ర ఎంతో ఉందని ఆధారాలు లభించాయి. దీనిపై భవిష్యత్తులో జరిగే మరిన్ని పరిశోధనలకు రాజమండ్రి కేంద్ర బిందువు కానుంది.

ఇదీ జరిగింది!
"మునుపు ఇక్కడ ఎక్కువగా బీడు భూములు, ఈత, పైన్ జాతులకు చెందిన చెట్లు ఉండేవి. డైనోసార్ల పేడపై పరిశోధనలు చేసినప్పుడు అవి ఈ జాతుల చెట్ల ఆకులనే తినేవని తేలింది. అగ్నిపర్వతాలు బద్దలైన అనంతరం వెలువడిన విష వాయువుల వల్ల తేమ పెరిగింది. ఆ తేమ వల్ల గడ్డి మొక్కలు పెరగటం మొదలైంది. లావా గడ్డకట్టడం వల్ల మట్టి సాంద్రత తగ్గకపోగా, కాలంతో పాటుగా లావా మట్టిగా మారింది. దీని వల్ల భూసారం మరింతగా పెరిగింది'' - నాగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ వందనా సామంత్

హైదరాబాద్, జనవరి1 : ఆదిలాబాద్ సమీప ప్రాంతాల్లో డైనోసార్లు ఉండేవని ఇప్పటిదాకా జరిగిన అధ్యయనంలో తేలింది. తాజా పరిశోధనల నేపథ్యంలో ఇవి కోస్తా ప్రాంతంలో కూడా సంచరించేవని స్పష్టమైంది. ఈ డైనోసార్లు ఎలా మరణించాయనే అంశంపైనా శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భూమిని ఓ భారీ గ్రహ శకలం తాకిందని, దీని తాకిడికి భూమిపై నివసించే జీవ, వృక్ష జాతులన్నీ నశించాయని ఒక సిద్ధాంతం చెబుతోంది. చాలా మంది శాస్త్రవేత్తలు దీనినే సమర్థిస్తూ వచ్చారు. అయితే... ఇది నిజం కాదని, లావా ప్రవాహమే జీవ జాతుల హననానికి కారణమని ఇప్పుడు ఆధారాలు లభించడంతో శాస్త్రీయ ప్రపంచంలో సంచలనం చెలరేగింది.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తాము చేసిన పరిశోధనల గురించి ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న కెల్లర్ 'ఆన్‌లైన్'కు ప్రత్యేకంగా వివరించారు. ఆమెతోపాటు ఈ పరిశోధనల్లో పాల్గొన్న చెన్నైలోని ఓఎన్‌జీసీ ప్రాంతీయ ప్రయోగశాలలో ముఖ్య శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎ.ఎన్. రెడ్డి, నాగపూర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వందనా సామంత్ కూడా 'ఆన్‌లైన్'కు ఈ వివరాలు తెలిపారు. కృష్ణా గోదావరి బేసిన్‌లో సహజ వాయువు, చమురు ఎలా ఏర్పడ్డాయి? కోనసీమ ప్రాంతం ఇప్పుడు అంత సస్యశ్యామలంగా ఉండటానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వీరు అందించిన వివరాల ప్రకారం...

ఒకప్పుడు...
దాదాపు 6 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళితే..... ఇప్పుడున్నట్లుగా భూమి 'ఖండ' ఖండాలుగా ఉండేది కాదు. భారత్, ఆఫ్రికా కలిసి ఉండేవి. డైనోసార్లతో సహా భారీ జంతు జాలానికి ఈ భూమి ఆవాసంగా ఉండేది. అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉన్నా... వాటి ప్రభావం పరిమితంగానే ఉండేది. ఒకసారి... ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర ఉన్న అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి.

ఇది ఎంత శక్తిమంతమంటే... ఆ లావా ప్రవహించిన ప్రాంతమంతా బూడిదైపోయింది. లక్షలాది జీవులు లావాలో చిక్కుకుని మరణించాయి. ఈ లావా దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి సమీపంలో బంగాళాఖాతంలో కలిసిపోయింది. "అంతకుముందు కూడా మహాబలేశ్వర్‌లో నాలుగు విస్ఫోటాలు జరిగాయి. కానీ... లావా కొంత వరకు మాత్రమే ప్రవహించి ఆగిపోయింది'' అని ప్రొఫెసర్ కెల్లర్ వివరించారు.

జీవుల హననం...
భారీ అగ్నిపర్వతం విస్ఫోటానికి ముందు భూమిపై రెండు రకాల జీవులు నివసిస్తుండేవి. ఎనభై అడుగుల దాకా ఎత్తున్న భీకరమైన డైనోసార్‌లు భారీ జీవులు! చిన్న చిన్న జీవులు అని అనుకునేవి కూడా పది అడుగుల ఎత్తు ఉండేవి. సముద్రంలోనూ రకరకాల జీవులు ఉండేవి. "లావా భీకరమైన వేగంతో సముద్రంలో కలిసినప్పుడు... అందులో కొన్ని జీవులు చిక్కుకుని గడ్డకట్టుకుపోయాయి.

అలాంటి జీవుల అవశేషాలను ఓఎన్‌జీసీ బావుల వద్ద జరిపిన తవ్వకాల్లో కనుగొన్నాం. ఆ సమయంలో ప్లాంక్‌టోనిక్ ఫోర్మామినిఫిరా అనే జీవినివసించేది. దీనికి సంబంధించిన కొన్ని అవశేషాలు మాకు లావా పొరల్లో దొరికాయి. ఈ ఫోర్మామినిఫిరా ఏక కణజీవి. ఆక్సిజన్ ఆధారంగా బతుకుతుంది. వాతావరణంలో ఏ మాత్రం ఆక్సిజన్ తగ్గినా ఇది మరణిస్తుంది. ఓఎన్‌జీసీ బావుల వద్ద జరిపిన తవ్వకాల్లో ఇది దొరకడంతో... వాతావరణంలో వచ్చిన మార్పులను పసిగట్టేందుకు అవకాశం లభించింది'' అని కెల్లర్ వివరించారు.

వాతావరణంలో మార్పులు...
సాధారణంగా అగ్ని పర్వతాల నుంచి లావా ప్రవాహంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్, ఇతరత్రా విషవాయువులు కూడా వెలువడతాయి. "వీటివల్ల వాతావరణంలో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. దీనివల్ల యాసిడ్ వానలు పడతాయి. ఈ మార్పులు భూమిపై ఉన్న జీవులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఆ సమయంలో కూడా ఇదే జరిగింది. జీవుల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి'' అని ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ వందనా సామంత్ వివరించారు. కేవలం జీవ జాతులే కాదు. వృక్ష జాతులు కూడా ఈ మార్పులకు తట్టుకోలేకపోయాయి. "రాజమండ్రి సమీపంలో లభించిన అవశేషాలను, మేఘాలయలో దొరికిన కొన్ని నమూనాలను పోల్చి చూశాం.

అప్పట్లో ఆమ్ల వర్షాలు కురిసినట్లు ఈ పరిశోధనలో స్పష్టమైంది'' అని కెల్లర్ తెలియజేశారు. కాలంతోపాటుగా విషవాయువుల సాంద్రత తగ్గటం మొదలయిందని... జీవం ఆవిర్భవించటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. "వాతావరణంలో వచ్చిన మార్పులు, సముద్ర మట్టంలో వచ్చిన హెచ్చు తగ్గుల వల్లే చిన్న చిన్న జీవులు పుట్టాయని ఇప్పటిదాకా భావిస్తున్నాం. కానీ... దీనికి ఆమ్ల వర్షాల తర్వాత ఏర్పడిన వాతావరణమే కారణమని మా పరిశోధనలో తేలింది'' అని వందన తెలిపారు.

ఖనిజ సంపదకు కారణం...
కృష్ణా-గోదావరి డెల్టాలో ఖనిజ నిక్షేపాలు ఎలా ఏర్పడ్డాయో కూడా ప్రిన్స్‌టన్ వర్సిటీ నిపుణుల పరిశోధనలో తెలిసింది. "ఒకప్పుడు భూ ఉపరితలమంతా కలిసి ఉండేది. దాదాపు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో రెండు వేల అడుగుల కింద ఉన్న ద్రవ పదార్థం (మాగ్నా) పైకి ఎగజిమ్మింది. ఈ పేలుడు వల్ల భూభాగం కొంత పక్కకు జరిగింది. ఇలాంటి పేలుళ్లు తరచూ జరగడం వల్ల భూ ఉపరితలంలో అనేక మార్పులు సంభవించాయి. ఒకప్పుడు భారత్ భూభాగం అంటార్కిటికాతో కలిపి ఉండేది. పేలుళ్ల వల్ల భారత్ భూభాగం నెమ్మదిగా ఉత్తర దిశకు పయనించటం మొదలుపెట్టింది. అది మడ్గాస్కర్ దగ్గరకు వచ్చి చేరింది.

ఆ సమయంలో మడ్కాస్కర్‌లో మరో పేలుడు జరిగింది. దీంతో భారత్ భూభాగం కదులుతూ వచ్చి ఇప్పుడున్న చోట స్థిరపడింది'' అని ఓఎన్‌జీసీకి చెందిన డాక్టర్ ఎ.ఎన్. రెడ్డి తెలిపారు. ఇలా భూభాగం కదలడం వల్ల భారత్‌కు రెండు ప్రయోజనాలు ఏర్పడ్డాయి. భారత్ భూభాగంలో అగ్ని పర్వతాలు లేకపోవడం మొదటి ప్రయోజనమైతే.. మన భూభాగంలో ఉన్న లావా గడ్డకట్టడం మరొకటి. ఈ మార్పుల వల్ల కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఏర్పడ్డాయి. అనేక రకాల ఖనిజాలు కూడా ఏర్పడ్డాయి. దీంతోపాటుగా రాజమండ్రి సమీప ప్రాంతాల్లో అత్యంత సారవంతమైన భూములు కూడా ఏర్పడటానికి ఈ మార్పులు కారణమయ్యాయి.

-స్పెషల్ డెస్క్

కచ్ టు రాజమండ్రి 'లావా'రిస్! ఈ ఫొటో చూశారా!? ఇందులో గుజరాత్‌లోని కచ్ నుంచి బంగాళాఖాతం వరకు కనిపిస్తున్న ఆ ఎర్రటి ప్రాంతమంతా ఏమిటనుకున్నారు!? ప్రపంచంలోనే అత్యంత దూరం లావా ప్రవహించిన ప్రాంతమిది. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల కిందట మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. వాటి నుంచి పెల్లుబికిన లావా.. అటు గుజరాత్‌లోని కచ్ వరకూ వెళ్లింది. ఇటు.. దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి సమీపంలో బంగాళాఖాతంలో కలిసింది. అప్పట్లో లావా ప్రవహించిన ప్రాంతమే ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా లావా అత్యధిక దూరం ప్రయాణించిన ప్రాంతం కూడా ఇదే!

2011 released telugu films

Sunday, December 25, 2011

తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన మన భానువూపకాష్

నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి భానువూపకాష్. ఆయన కమర్షియల్ సినిమా రంగంలోకి వెళ్లడానికి ఎంతమాత్రం ఆసక్తి చూపలేదు. కాకపోతే, తానే చేయాలని అడిగిన మీదట చేసిన పాతిక సినిమాలు తప్పా ఆయనకు నాటకమే నిండు జీవితం....

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.


తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భానువూపకాష్. ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే. నాటకకళ పురోభివృద్ధికి పట్టుకొమ్మగా నిలిచిన భానుప్రకాష్ చివరకు చిల్లిగవ్వయినా మిగుల్చు కోకుండా తనువు చాలించడం ఆయన ప్రగాఢ అంకితభావానికి నిదర్శనం.
భానువూపకాష్ పేరు చెప్పగానే పాతతరం నాటక ప్రియులకు ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి నాటకాలు గుర్తుకు వస్తాయి. నాటకరంగ సేవలోనే తన నిజ జీవితాన్ని కూడా పరిపూర్ణంగా పండించుకొన్న ధన్యజీవి ఆయన. ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘బుద్ధిమంతుడు’, ‘ఆత్మీయులు’, ‘భక్త తుకారాం’, ‘ముద్దులకొడుకు’, ‘రాధాకృష్ణ’, ‘చిల్లరదేవుళ్లు’, ‘దయామయుడు’ తదితర రెండు డజన్లకు పైగా సినిమాలలోనూ నటించారాయన.

అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్న భానువూపకాష్ అచ్చమైన మన తెలంగాణ బిడ్డ. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భానువూపకాష్‌రావు. నల్లగొండలో వెంకటహరి, అండాలమ్మ దంపతులకు 1939 ఏప్రిల్ 21న జన్మించారు.
భానువూపకాష్ ఇంట్లో సాంస్కృతిక వాతావరణం అన్నదే ఉండేది కాదు. అయినా, సొంత అభిరుచితో కళారంగం వైపు దృష్టి మళ్లించారు. ఆయన మేనమామ ధరణి శ్రీనివాసరావు మాత్రం ప్రసిద్ధ్ద నాటక రచయిత. భానువూపకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతుండగానే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై నటించారు. ఆ తొలి నాటకం పేరు ‘తార్‌మార్’. ఇందులో భాను మంచి వేషం వేశారు. అందులోని బాల భాను నటన అందరికీ నచ్చింది. ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు. దాంతో భాను నటనపట్ల తనలోని ఆసక్తిని మరింత పెంచుకున్నారు.

తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి వినాయకచవితి మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో ఎస్8. కె. ఆంజనేయులు అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. అదే తనకు ప్రేరణనిచ్చింది. ఎలాగైతేనేం, తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.

సైఫాబాద్ సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భానువూపకాష్‌కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నాడు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భానువూపకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
తర్వాత తెలుగు సంగీత, నాటకరంగంలో భానువూపకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘ శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భానువూపకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు.

‘హైదరాబాదులో పుట్టినతనికి ఇంత చక్కటి ఉచ్చారణ రావడం గ్రేట్’ అని వారు ఆశ్చర్య పడ్డారు. భానువూపకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. కారణం, ఇందులోని కళాకారులు మెరుపు వేగంతో నటనా వైవిధ్యాన్ని ప్రదర్శించేవారు. ఏ నాటకమైనా ఒక ఉప్పెనలా సాగేది. పాత్రలతో ప్రేక్షకులు లీనమై పోయేవారు. ఫలితంగా ఎన్నో ప్రశంసలు.

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.
నాటకం, నాటిక ఏదైనా సరే ఆయన దర్శకత్వంలో రూపొందిందంటే అందులో నవరసాలు ఉంటాయన్న పేరుంది. అయితే, భానుప్రకాష్ నటనలో మాత్రం మెలోవూడామా పాళ్లు అధికమని నాటక పరిశీలకులు అభివూపాయపడతారు.

ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భానువూపకాష్ నటనను స్థానం వారు అభినందించారు. ఇంకా ‘ఆకాశవాణి’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ, మద్రాస్8, కలకత్తా, కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
ఇలా రంగస్థలంపైనే గాక సినిమాల్లోనూ భానువూపకాష్ పలు పాత్రలు పోషించారు. కాకపోతే, తన ప్రథమ ప్రాధాన్యం నాటకాలకే ఇచ్చారు. సినీ పాత్రలలోనూ తనదైన విలక్షణతను ప్రదర్శించారు. సాధారణంగా ఎవ్వరైనా సినిమాల్లో పాత్రల కోసం వెంట పడుతుంటారు. కానీ, కొన్ని పాత్రలు పోషించడానికి సినిమా రంగమే ఆయన వెంట పడటం విశేషం.

మొదటి నుండి నాటకాలకే పూర్తికాలం పనిచేసే ఆయనకు సినిమాలవైపు మళ్లాలన్న ఆలోచనే రాలేదు. ఒకసారి ఆయన నాటకాన్ని చూసిన నిర్మాత దుక్కిపాటి మధుసూదన్‌రావు తొలుత తన ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే ‘పూలరంగడు’లో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నారు. 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందారు. ‘యువ కళావాహిని’ సంస్థ కె.వేంక అవార్డు, తెలుగు యూనివర్సిటి ఉత్తమ నటుడి అవార్డు, ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం, 1988లో ఉగాది పురస్కారం, జూలూరు వీరేశలింగం అవార్డు, కిన్నెర ఉగాది పురస్కారం, నాటక కృషీవలుడు పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటివి ఎన్నో ఆయనను వరించాయి.

జీవితమంతా నాటకంగా, నాటకమే జీవితంగా గడిపిన ఈ అద్భుత కళాకారుడు తన మొత్తం జీవిత కాలంలో రోజుకు గంటసేపు కూడా కుటుంబానికి కేటాయించలేదంటే ఆశ్చర్యమే. అలా చివరి దాకా నాట రంగం కోసం తపిస్తూనే 2009 జూన్ 6న తన 70వ యేట తనువు చాలించారు. హెచ్.ఎ.ఎల్.లో ఉద్యోగం చేసినా భానుప్రకాష్ చివరికి ఒక్క రూపాయైనా మిగుల్చుకోలేదని ఆయన సన్నిహితులు అంటారు. కనీసం పెన్షన్ అయినా లేకుండానే చివరి రోజులు గడిపారు. తెలంగాణ గర్వించదగ్గ ఈ కళాకారుడిది తెలుగు నాటక రంగ చరివూతలోనే అద్వితీయమైన స్థానం.

‘చివరి శ్వాస వరకు నాటకం కోసమే’
భానుప్రకాష్ సతీమణి శ్రీమతి సరస్వతి
భానువూపకాష్ సహధర్మచారిణి సరస్వతి హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసముంటున్నారు. ‘బతుకమ్మ’ కోసం ఈ రచయిత ఆమెను పలకరించగా ఆమె ఒకింత ఉద్వేగానికి లోనైనారు.
‘‘ఆ మనిషి , మనసు రెండూ నాటకం కోసమే అన్నట్లు జీవించారు. 11 ఏళ్ల వయస్సులోనే రంగస్థలంపై వేషం వేశారు. మా వదినగారి అన్న కావడం వల్ల పెళ్లికి ముందే ఆయనను నటుడిగా స్టేజీపై చూశాను. ఆయన నటించిన నాటకాల్లో ‘చీకటి కోణాలు’లోని నటన నాకు చాలా ఇష్టం’’ అని ఆమె అన్నారు.
‘‘సినిమాల్లో వేషాలకోసం ఆయన ఏనాడూ ఎవ్వరినీ అర్థించలేదు. సినిమా వాళ్లే కొన్ని పాత్రలకు వీరైతైనే సరిపోతారని గుర్తించి అవకాశం ఇచ్చారు’’ అన్నారామె.
‘‘అహోరావూతులు నాటకాలంటూ తిరిగే వారాయన. పెళ్లైన కొత్తలోనే నెలల తరబడి నాటకాలకోసం ఊర్లు పట్టుకొని తిరిగేవారు. చనిపోవడానికి వారం రోజులు ముందు కూడా నాటకాల పనిమీదే వరంగల్, భద్రాచలం వెళ్లి వచ్చారు. చివరి శ్వాసదాకా నాటకాల గురించే ఆలోచించారు’’ అన్న ఆమె మాటలు నిజంగానే అక్షరసత్యాలు.