Sunday, December 25, 2011

తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన మన భానువూపకాష్

నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి భానువూపకాష్. ఆయన కమర్షియల్ సినిమా రంగంలోకి వెళ్లడానికి ఎంతమాత్రం ఆసక్తి చూపలేదు. కాకపోతే, తానే చేయాలని అడిగిన మీదట చేసిన పాతిక సినిమాలు తప్పా ఆయనకు నాటకమే నిండు జీవితం....

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.


తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భానువూపకాష్. ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే. నాటకకళ పురోభివృద్ధికి పట్టుకొమ్మగా నిలిచిన భానుప్రకాష్ చివరకు చిల్లిగవ్వయినా మిగుల్చు కోకుండా తనువు చాలించడం ఆయన ప్రగాఢ అంకితభావానికి నిదర్శనం.
భానువూపకాష్ పేరు చెప్పగానే పాతతరం నాటక ప్రియులకు ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి నాటకాలు గుర్తుకు వస్తాయి. నాటకరంగ సేవలోనే తన నిజ జీవితాన్ని కూడా పరిపూర్ణంగా పండించుకొన్న ధన్యజీవి ఆయన. ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘బుద్ధిమంతుడు’, ‘ఆత్మీయులు’, ‘భక్త తుకారాం’, ‘ముద్దులకొడుకు’, ‘రాధాకృష్ణ’, ‘చిల్లరదేవుళ్లు’, ‘దయామయుడు’ తదితర రెండు డజన్లకు పైగా సినిమాలలోనూ నటించారాయన.

అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్న భానువూపకాష్ అచ్చమైన మన తెలంగాణ బిడ్డ. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భానువూపకాష్‌రావు. నల్లగొండలో వెంకటహరి, అండాలమ్మ దంపతులకు 1939 ఏప్రిల్ 21న జన్మించారు.
భానువూపకాష్ ఇంట్లో సాంస్కృతిక వాతావరణం అన్నదే ఉండేది కాదు. అయినా, సొంత అభిరుచితో కళారంగం వైపు దృష్టి మళ్లించారు. ఆయన మేనమామ ధరణి శ్రీనివాసరావు మాత్రం ప్రసిద్ధ్ద నాటక రచయిత. భానువూపకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతుండగానే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై నటించారు. ఆ తొలి నాటకం పేరు ‘తార్‌మార్’. ఇందులో భాను మంచి వేషం వేశారు. అందులోని బాల భాను నటన అందరికీ నచ్చింది. ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు. దాంతో భాను నటనపట్ల తనలోని ఆసక్తిని మరింత పెంచుకున్నారు.

తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి వినాయకచవితి మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో ఎస్8. కె. ఆంజనేయులు అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. అదే తనకు ప్రేరణనిచ్చింది. ఎలాగైతేనేం, తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.

సైఫాబాద్ సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భానువూపకాష్‌కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నాడు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భానువూపకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
తర్వాత తెలుగు సంగీత, నాటకరంగంలో భానువూపకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘ శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భానువూపకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు.

‘హైదరాబాదులో పుట్టినతనికి ఇంత చక్కటి ఉచ్చారణ రావడం గ్రేట్’ అని వారు ఆశ్చర్య పడ్డారు. భానువూపకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. కారణం, ఇందులోని కళాకారులు మెరుపు వేగంతో నటనా వైవిధ్యాన్ని ప్రదర్శించేవారు. ఏ నాటకమైనా ఒక ఉప్పెనలా సాగేది. పాత్రలతో ప్రేక్షకులు లీనమై పోయేవారు. ఫలితంగా ఎన్నో ప్రశంసలు.

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.
నాటకం, నాటిక ఏదైనా సరే ఆయన దర్శకత్వంలో రూపొందిందంటే అందులో నవరసాలు ఉంటాయన్న పేరుంది. అయితే, భానుప్రకాష్ నటనలో మాత్రం మెలోవూడామా పాళ్లు అధికమని నాటక పరిశీలకులు అభివూపాయపడతారు.

ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భానువూపకాష్ నటనను స్థానం వారు అభినందించారు. ఇంకా ‘ఆకాశవాణి’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ, మద్రాస్8, కలకత్తా, కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
ఇలా రంగస్థలంపైనే గాక సినిమాల్లోనూ భానువూపకాష్ పలు పాత్రలు పోషించారు. కాకపోతే, తన ప్రథమ ప్రాధాన్యం నాటకాలకే ఇచ్చారు. సినీ పాత్రలలోనూ తనదైన విలక్షణతను ప్రదర్శించారు. సాధారణంగా ఎవ్వరైనా సినిమాల్లో పాత్రల కోసం వెంట పడుతుంటారు. కానీ, కొన్ని పాత్రలు పోషించడానికి సినిమా రంగమే ఆయన వెంట పడటం విశేషం.

మొదటి నుండి నాటకాలకే పూర్తికాలం పనిచేసే ఆయనకు సినిమాలవైపు మళ్లాలన్న ఆలోచనే రాలేదు. ఒకసారి ఆయన నాటకాన్ని చూసిన నిర్మాత దుక్కిపాటి మధుసూదన్‌రావు తొలుత తన ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే ‘పూలరంగడు’లో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నారు. 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందారు. ‘యువ కళావాహిని’ సంస్థ కె.వేంక అవార్డు, తెలుగు యూనివర్సిటి ఉత్తమ నటుడి అవార్డు, ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం, 1988లో ఉగాది పురస్కారం, జూలూరు వీరేశలింగం అవార్డు, కిన్నెర ఉగాది పురస్కారం, నాటక కృషీవలుడు పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటివి ఎన్నో ఆయనను వరించాయి.

జీవితమంతా నాటకంగా, నాటకమే జీవితంగా గడిపిన ఈ అద్భుత కళాకారుడు తన మొత్తం జీవిత కాలంలో రోజుకు గంటసేపు కూడా కుటుంబానికి కేటాయించలేదంటే ఆశ్చర్యమే. అలా చివరి దాకా నాట రంగం కోసం తపిస్తూనే 2009 జూన్ 6న తన 70వ యేట తనువు చాలించారు. హెచ్.ఎ.ఎల్.లో ఉద్యోగం చేసినా భానుప్రకాష్ చివరికి ఒక్క రూపాయైనా మిగుల్చుకోలేదని ఆయన సన్నిహితులు అంటారు. కనీసం పెన్షన్ అయినా లేకుండానే చివరి రోజులు గడిపారు. తెలంగాణ గర్వించదగ్గ ఈ కళాకారుడిది తెలుగు నాటక రంగ చరివూతలోనే అద్వితీయమైన స్థానం.

‘చివరి శ్వాస వరకు నాటకం కోసమే’
భానుప్రకాష్ సతీమణి శ్రీమతి సరస్వతి
భానువూపకాష్ సహధర్మచారిణి సరస్వతి హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసముంటున్నారు. ‘బతుకమ్మ’ కోసం ఈ రచయిత ఆమెను పలకరించగా ఆమె ఒకింత ఉద్వేగానికి లోనైనారు.
‘‘ఆ మనిషి , మనసు రెండూ నాటకం కోసమే అన్నట్లు జీవించారు. 11 ఏళ్ల వయస్సులోనే రంగస్థలంపై వేషం వేశారు. మా వదినగారి అన్న కావడం వల్ల పెళ్లికి ముందే ఆయనను నటుడిగా స్టేజీపై చూశాను. ఆయన నటించిన నాటకాల్లో ‘చీకటి కోణాలు’లోని నటన నాకు చాలా ఇష్టం’’ అని ఆమె అన్నారు.
‘‘సినిమాల్లో వేషాలకోసం ఆయన ఏనాడూ ఎవ్వరినీ అర్థించలేదు. సినిమా వాళ్లే కొన్ని పాత్రలకు వీరైతైనే సరిపోతారని గుర్తించి అవకాశం ఇచ్చారు’’ అన్నారామె.
‘‘అహోరావూతులు నాటకాలంటూ తిరిగే వారాయన. పెళ్లైన కొత్తలోనే నెలల తరబడి నాటకాలకోసం ఊర్లు పట్టుకొని తిరిగేవారు. చనిపోవడానికి వారం రోజులు ముందు కూడా నాటకాల పనిమీదే వరంగల్, భద్రాచలం వెళ్లి వచ్చారు. చివరి శ్వాసదాకా నాటకాల గురించే ఆలోచించారు’’ అన్న ఆమె మాటలు నిజంగానే అక్షరసత్యాలు.

No comments:

Post a Comment